ఉద్యోగస్థులారా ఆలోచించండి ఆచరించండి ముఖ్యమంత్రి కుటుంబపెద్దగా ఉన్న అతిపెద్ద కుటుంబంలో ఉద్యోగులు కూడా సభ్యులే, బయటివారు కారు. ప్రభుత్వాన్ని నడపడంలో , ప్రజలకు సేవలందించడంలో, సంపద పెంచడం, పంచటంలో మీ పాత్ర చాలా కీలకం. ఉద్యోగ భద్రత, జీతభత్యాలలో పెరుగుదల ఖచ్చితంగా మీ హక్కు , కానీ కుటుంబ పరిస్థితులు , జమాఖర్చులు , వాస్తవాలు గ్రహించి కుటుంబపెద్దతో సహకరించవలచిన ఆవశ్యకత మీ మీద ఉంది. రాష్ట్రము విడిపోయిన తర్వాత ఆదాయం గణనీయంగా పడిపోవటం, వ్యవసాయరంగం ఎదురుకొంటున్న సవాళ్లు , కరోనా ఇబ్బందులు అందరికి అందరికి తెలుసు. ఈ సవాళ్ళని ఎదురుకొని రాష్ట్రాన్ని ప్రగతిపధంలో నడపటం , సంపద సృష్టించటంలో మేధావులైన ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగ భద్రత, జీతభత్యాలు పెరుగుదల హక్కు, అదేవిధంగా సంపద సృష్టించడం, రాష్ట్రవనరులకు పదునుపెట్టి సమర్థవంతంగా వినియోగించడం మీ భాద్యత. హక్కులగురుంచి కుటుంబపెద్దలతో పోరాడే ఉద్యోగసంఘాలు , ఉద్యోగుల తరుపున ప్రభుత్వానికి వారి భాద్యతలు, జవాబుదారితనం గురించి ఖచ్చితమైన హమీ ఇవవలచిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. ఇటీవల సోషల్ మీడియాలో ఉద్యోగులను కించపరుస్తు పోస్టులు పెట్టటం, వారిని సామజిక చెదపురుగులుగా వర్
Comments