గ్రామీణ ఉపాధి హామీ పథకం - వాస్తవ పరిస్థితులు - కొత్త ఆలోచనలు
గ్రామీణ ఉపాధి హామీ పథకం - వాస్తవ పరిస్థితులు - కొత్త ఆలోచనలు 2006లో మొదలు పెట్టబడిన ప్రపంచములోనే అతిపెద్ద పేదరిక నిర్ములన కార్యక్రమం. రాజకీయ సమీకరణాలు మారినా దిగ్విజయంగా వెలుగుతున్న తీరు. 2020-21లో లక్ష కోట్లఫై చిలుకు బడ్జెట్ , 6.51 కోట్ల పేదప్రజలకు 130.9 కోట్ల పనిదినాలు ఒక్క ఏడాదిలో కల్పిస్తున్న సందర్భం. కార్యక్రమ ఉద్దేశం ప్రకారం 60శాతం నిధులు వ్యవసాయ పద్దు అంటే నీరు, చెట్టు, భూమి అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. 74 శాతంపైనా వీటి నిమిత్తం ఖర్చుచేసినట్టు ఉన్నలెక్కలు. ఎక్కడ పేదరికం ఎక్కువవుందో అక్కడ ఖర్చు ఎక్కువ పెట్టే ఉద్దేశ్యంతో రాష్ట్రము, జనాభా ప్రాతిపదికన కేటాయించని పథకం. పథకం ఆరంభించి 15 ఏళ్ళు దాటినా పేదరికంలో కొట్టాడుతున్న బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు పథకాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోని పరిస్థితి. 18% తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే కేవలం 4.8% బీహార్, 7% యూపీ , 2.7% మహారాష్ట్ర ఉపయోగించుకున్నాయంటే కార్యక్రమ లక్ష్యాలు ఎలా గతి తప్పుచున్నాయో అర్ధం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లపేరుతో లక్షలకోట్లు గ్రామీణ ఉపాధి నుండి మెటీరియల్ కంపోనెంట్ పేరు...