ఉద్యోగస్థులారా ఆలోచించండి ఆచరించండి
ఉద్యోగస్థులారా ఆలోచించండి ఆచరించండి
ముఖ్యమంత్రి కుటుంబపెద్దగా ఉన్న అతిపెద్ద కుటుంబంలో ఉద్యోగులు కూడా సభ్యులే, బయటివారు కారు. ప్రభుత్వాన్ని నడపడంలో , ప్రజలకు సేవలందించడంలో, సంపద పెంచడం, పంచటంలో మీ పాత్ర చాలా కీలకం. ఉద్యోగ భద్రత, జీతభత్యాలలో పెరుగుదల ఖచ్చితంగా మీ హక్కు , కానీ కుటుంబ పరిస్థితులు , జమాఖర్చులు , వాస్తవాలు గ్రహించి కుటుంబపెద్దతో సహకరించవలచిన ఆవశ్యకత మీ మీద ఉంది.
రాష్ట్రము విడిపోయిన తర్వాత ఆదాయం గణనీయంగా పడిపోవటం, వ్యవసాయరంగం ఎదురుకొంటున్న సవాళ్లు , కరోనా ఇబ్బందులు అందరికి అందరికి తెలుసు. ఈ సవాళ్ళని ఎదురుకొని రాష్ట్రాన్ని ప్రగతిపధంలో నడపటం , సంపద సృష్టించటంలో మేధావులైన ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగ భద్రత, జీతభత్యాలు పెరుగుదల హక్కు, అదేవిధంగా సంపద సృష్టించడం, రాష్ట్రవనరులకు పదునుపెట్టి సమర్థవంతంగా వినియోగించడం మీ భాద్యత. హక్కులగురుంచి కుటుంబపెద్దలతో పోరాడే ఉద్యోగసంఘాలు , ఉద్యోగుల తరుపున ప్రభుత్వానికి వారి భాద్యతలు, జవాబుదారితనం గురించి ఖచ్చితమైన హమీ ఇవవలచిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.
ఇటీవల సోషల్ మీడియాలో ఉద్యోగులను కించపరుస్తు పోస్టులు పెట్టటం, వారిని సామజిక చెదపురుగులుగా వర్ణించడం మంచి పద్దతికాదు. ఇలాంటి వాటిని వెంటనే ఆపివేయాలి. ఉద్యోగులు జీతాలు అడిగారని బురద చల్లడం మంచి పద్దతికాదు. వారు మన నిత్యజీవనవిధానంలో భాగస్వాములే , వారి పనితనం సరిలేకపోతే ఎత్తిచూపండి , పై అధికారులకు ఫిర్యాదు చేయండి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెల్లండి , జవాబుదారీతనం పెంచే ప్రయత్నం చేయండి.
ఉద్యోగ సంఘాలు శేత్రస్థాయి పరిస్థితులు గమనించి ఉద్యోగులలో ఉన్న లోపాలు గుర్తించి వారిలో జవాబుదారీతనం పెంచడం, తప్పు దిద్దుకోనివారికి పెద్ద శిక్షలు పడేటట్టు ప్రభుత్వానికి సహకరించాలి .
నేను స్వయంగా గ్రామాల్లో చూసిన విషయాలు. క్రిష్ణా జిల్లాలో ఒక తహసీల్ధార్ నదిలో కలిచిపోయిన భూమి అడంగల్ ఒక రోజు ప్రభుత్వభూమిగా , పెద్దలకు ఇసుక ఇవాలనుకొన్న రోజు ప్రైవేట్ పట్టాగా మార్చడం, అల్లాంటి వారికి కోరుకొన్నచోట పోస్టింగ్ ఇవ్వటం, దేనికి సంకేతం? ఇలానే గుంటూరు జుల్లా ఒక గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్ మాన్ 5000 రూపాయలు ఇచ్చి ప్రైవేట్ వ్యక్తికి పని అప్పచెప్పి తను వ్యాపారం చూసుకొంటున్న సందర్భం. ఇంకొక గ్రామంలో ప్రభుత్వఉపాధ్యాయుడు 6000 రూపాయిలు ఇచ్చి ఇంకొకరికి బాధ్యతలు అప్పగించి , ప్రభుత్వం కొత్త టీచర్ని నియమించడంలేదు , నేను ఉదారస్వభావం కలవాడిని కనుక సొంత డబ్బు పెట్టి పిల్లల బాగోగులు చూస్తునాను అని చెప్పుకోవటం , ఇలాంటి వారికి స్థానిక నాయకులు, తహసీల్ధార్, మండల్ అభివృద్ధి అధికారి వత్తాదు పలకడం, వీటిని ఎలాచూడాలి? వాస్తంలో ఈ ఉపాద్యాయుడు పాఠాలు చెప్పటం మానేసి మంత్రులతో మంతనాలు, ప్రజాప్రతినిధులతో పైరవీలు చేస్తూ వ్యవస్థలను బ్రష్టుపట్టించే స్థితికి ఎదగటం దేనికి సంకేతం?
ఇల్లాంటి సంఘటనలు మన దేశంలో కొత్తకాదు. వీటిని చూడటానికి మూడో కన్ను అక్కరలేదు , మనసుపెట్టి చూస్తేచాలు. యువముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ప్రక్షాళన, జవాబుదారీతనం పెంచడం లాంటి విషయాలపై దృష్టిపెట్టి అలుపెరుగని పోరాటం చేస్తున్న సందర్భం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు ముందుండి ముఖ్యమంత్రి గారి సంకల్పానికి మద్దతిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం అని చాటిచెప్పాలి .
ప్రస్తుత ఉద్యోగుల సమస్య టీకప్పులో తుపాన్ లాంటిది మాత్రమే. ఒకటి రెండు రోజుల్లో సమసిపోతుంది . ఆ దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ప్రధాన ప్రతిపక్షము, ప్రతికూల మీడియా ఈ సమస్య బంగాళాఖాతంలో పెనుతుపానుల మారాలి , సమస్య జటిలం కావాలి అని గోతికాడ నక్కల్లా కాసుకొని ఉన్నారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు వారి ఉచ్చులో పడవద్దు, బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు.
బొంతు బ్రాడ్కాస్టింగ్ కంపని
Comments