మనసున్న మారాజు మన ముఖ్యమంత్రి - రైతులకు పురుగుమందు సాయం
మనసున్న మారాజు మన ముఖ్యమంత్రి - రైతులకు పురుగుమందు సాయం
రైతులపై ఎనలేని ప్రేమ. వారిపై ఈగ కూడా వాలకూడదు అనే అంతటి సున్నిత మనస్తత్వం. తండ్రికి తగ్గ తనయుడు.
రైతుసమస్యలు అధికారులకు విన్నవించి పరిష్కరిస్తారనే ఉద్దేశంతో రైతు మిషన్ ఏర్పాటు, పాల ఉత్పత్తిదారులకు గిట్టుబాటుధర ,పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థ కొరకు పేరొందిన అమూల్ సంస్థతో ఒప్పందం, పంటకి గిట్టుబాటు ధర కోసం మార్కెటింగ్ నిధి, రైతు భరోసా కేంద్రాల ద్వారా సత్కర సేవలు, ఇంకా ఎన్నెనో పథకాలు.
ఇంత గొప్ప మనసున్న ముఖ్యమంత్రి , ఏంతో చేయాలనే తాపత్రయం, రైతు కోసం ఎంతైనా ఖర్చుకి ఎనకాడని తీరు . అయ్యినా 3 ఏళ్లగా ఒక్క ఎకరానికి కూడా డ్రిప్ లేదు, వరద సాయం అందలేదు , e పంట, e Kyc నమోదులో నిర్లక్ష్యం , అరకొర పనిముట్ల సదుపాయం ఇలా అనేక సమస్యలు. వీరికి కచ్చితంగా అధికారులను జవాబుదారీ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎంతో అనుభవజ్ఞులతో ఏర్పరచిన వ్యవసాయ మిషన్ ఈ దిశలో పని చేసి రైతు సంస్థలను పరిష్కరించి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తేవాలి. అంతేగాని,మేము సలహాలు ఇచ్చేవరకు , జవాబుదారీ మేముకాదు అని కాడి కింద వేయడం మంచిది కాదు.
ప్రకృతి వ్యవసాయంలో మనం ప్రపంచానికే ఆదర్శం , సేంద్రియ వ్యవసాయంలో సరిలేరు మనకెవ్వరు అని ఊదరగొట్టిన అధికారులు. దానికి తగట్టు ఎరువుల వాడకం , పురుగు మందుల వాడకం బాగా తగ్గింది మంచి పంట వచ్చింది అని చూపించే గణాంకాలు. అంతా మంచిగా ఉంటె, మనం అనుకున్నట్టు ప్రకృతి / సేంద్రీయ వ్యవసాయంవైపు అడుగులు వేస్తుంటే, 50% సబ్సిడీతో పురుగు మందులు అమ్ముదాం అనే ప్రతిపాదనలు పెట్టి ఒప్పించిన అధికారుల తీరు దేనికి సంకేతం. అంతగా ప్రేమఉంటే జీవ రసాయన మందులు ఇవ్వవచ్చుగదా?
ముఖ్యమంత్రి గారు ప్రకృతి ప్రేమికులు, సేంద్రీయ ఉత్పత్తులు , సేంద్రీయ పాలు అంటే ఎంతో మక్కువ అని విన్నాం. అందుకనే గత ప్రభుత్వంలో ప్రారంభించిన సహజ వ్యవసాయవిదానాన్ని ఎన్నో రెట్లు పెంచాలి, ఖర్చు తగ్గించాలి , ఉత్పాదకత, ఉత్పత్తి పెంచాలి, ఫలితాలు అందరికి పంచాలి అని ముఖ్యమంత్రి గారు అదేచించడం జరిగింది.
ఇంత స్పష్టమైన విధానము ఉన్నప్పటికి , కేంద్రం కూడా రసాయనాలు తగ్గించండి అని చెపుతున్నా రసాయన పురుగు మందులు వాడకం పెంచే విధంగా నిర్ణయాలు తీసుకోవడం మంచి పద్దతి కాదు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని కేటాయించిన బడ్జెట్టుని జీవ రసాయన మందులకు కానీ , వ్యవసాయ మిషన్ తో సంప్రదించి మంచి పథకాలకు కేటాయిస్తే మంచిది.
ఉన్నతాదికారులలో రాష్ట్ర వ్యవసాయ విధానంపై అబిప్రాయభేదాలుంటే చర్చించుకొని ముఖ్యమంత్రిగారి ఆదేశాలమేరకు ఒకే మాట ఒకే బాటగా ముందుకుపోవాలి. అలాకాకుండా ఎవరి పంధాలో వారు నడిస్తే రాష్ట్రానికి , ముఖ్యంగా రాష్ట్ర రైతాంగాయానికి తీరని నష్టం. వ్యవసాయ మిషన్ వారు రాష్ట్ర ప్రయోజనాలు , ముఖ్యమంత్రిగారి ఆలోచన, రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకొని అధికారులను ఆ దిశలో నడపవలచిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.
జగన్మోహన రెడ్డి గారి ఆలోచనా విధానాన్ని ఆచరణలో పెడదాం రాజన్న రైతు రాజ్యాన్ని విస్తరిద్దాం ,
బొంతు బ్రాడ్కాస్టింగ్ కంపెనీ
Comments