మనసున్న మారాజు మన ముఖ్యమంత్రి - రైతులకు పురుగుమందు సాయం
మనసున్న మారాజు మన ముఖ్యమంత్రి - రైతులకు పురుగుమందు సాయం రైతులపై ఎనలేని ప్రేమ. వారిపై ఈగ కూడా వాలకూడదు అనే అంతటి సున్నిత మనస్తత్వం. తండ్రికి తగ్గ తనయుడు. రైతుసమస్యలు అధికారులకు విన్నవించి పరిష్కరిస్తారనే ఉద్దేశంతో రైతు మిషన్ ఏర్పాటు, పాల ఉత్పత్తిదారులకు గిట్టుబాటుధర ,పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థ కొరకు పేరొందిన అమూల్ సంస్థతో ఒప్పందం, పంటకి గిట్టుబాటు ధర కోసం మార్కెటింగ్ నిధి, రైతు భరోసా కేంద్రాల ద్వారా సత్కర సేవలు, ఇంకా ఎన్నెనో పథకాలు. ఇంత గొప్ప మనసున్న ముఖ్యమంత్రి , ఏంతో చేయాలనే తాపత్రయం, రైతు కోసం ఎంతైనా ఖర్చుకి ఎనకాడని తీరు . అయ్యినా 3 ఏళ్లగా ఒక్క ఎకరానికి కూడా డ్రిప్ లేదు, వరద సాయం అందలేదు , e పంట, e Kyc నమోదులో నిర్లక్ష్యం , అరకొర పనిముట్ల సదుపాయం ఇలా అనేక సమస్యలు. వీరికి కచ్చితంగా అధికారులను జవాబుదారీ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎంతో అనుభవజ్ఞులతో ఏర్పరచిన వ్యవసాయ మిషన్ ఈ దిశలో పని చేసి రైతు సంస్థలను పరిష్కరించి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తేవాలి. అంతేగాని,మేము సలహాలు ఇచ్చేవరకు , జవాబుదారీ మేముకాదు అని కాడి కింద వేయడం మంచిది కాదు. ప్రకృత...