ఉందిలే మంచికాలం ముందూ ముందూనా
ఉందిలే మంచికాలం ముందూ ముందూనా
1.నమస్తే సర్. మేము మండలస్థాయి ముఖ్య అధికారులం. ఉచిత ఇసుక విధానం ఎంతో పారదర్శకమైంది, రాజకీయాలకు సంభందం లేదు అని నమ్మించి, అధికారుల పేరుతో జీవోలు ఇచ్ఛి, క్వారీ ఆపరేషన్స్ పచ్చ చొక్కాలకు ధారాదత్తం చేసి, ప్రజల వద్ద, చట్టం వద్ద మమ్మల్ని దోషులుగా నిలబెట్టిన మిమ్మల్ని వోటు అనే ఆయుధంతో గట్టిగా శిక్షించాములే
2. రాజకీయ పబ్బం గడుపుకోవడం
కోసం, మీరు పుట్టింది కూడా రాయలసీమలో అని మర్చి, రాయసీమ వాళ్ళు గుండాలు, అధికారమిస్తే
అరాచకాలు సృష్టిస్తారు అని మన ప్రాంతాన్ని చిన్న చూపు చూసిన మిమ్మల్ని ఓటు అనే ఆయుధంతో
గట్టిగా శిక్షించాములే. టాటా వీడుకోలు, ఇంక సెలవు.
3. నమస్కారమండి. కాపులకు
రిజర్వేషన్స్ అని నమ్మించి గొంతుకోస్తే ఒప్పిగ్గా భరించాం. మా జాతి నాయకుడిని కిర్లంపూడిలో ఘోరంగా అవమానిస్తే కడుపులో దాచుకున్నాం. పవన్ పార్టీతో మీరు చెడుగుడు ఆడుకొని మమ్మల్ని సంతలో పశువులా చూసినా ఓపిక పట్టాం. ఆఖరికి ఎన్నికల రోజు ఇనుమెట్ల పోలింగ్ బూత్ లో కోడెల మా జాతిని అవమానించిన తీరు, పైగా నేరం మాపై రుద్దాలనే ప్రయత్నం, అంబటి నాకు పోటీనా, జగన్ చంద్రబాబుకు పోటీనా, అసలు వైసీపీ టీడీపీకి పోటీనా అంటూ విర్రవీగిన పద్దతి మీ నాయకత్వానికి నిలువెత్తు అద్దం. మా కసి అంతా వోట్ రూపంలో చూపి ప్రతీకారం తీర్చుకున్నాములే.
4. సర్, మేము మండలస్థాయి
ప్రభుత్వ ఉద్యోగులం. ప్రజలయొక్క రెవిన్యూ, వ్యవసాయం, పశుపోషణ, విద్యుత్ సమస్యలు , ఇతర
సమస్యలు వారికి సంతృప్తి కలిగే విధంగా తీర్చటం మా విధి. కానీ మీ పాలనలో మమల్ని జన్మభూమి
కమిటీలకు బానిసలుగా మార్చి, కేవలం పచ్చ పాలనకే అంకితం చేసినా విధిలేక భరించాం. మా పనిని
మమ్మల్ని చేసుకోనియ్యకుండా , మీ నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాట దీక్షలు, జన్మభూమి సభలు, ఇవ్వి చాలదన్నట్టు వీడియో సమావేశాలు,
టన్నులకొద్దీ బోగస్ రిపోర్టులు తయారుచేయడం లాంటి చెత్త పనులతో మా కాలం వృధా చేసి మా
సబ్జెక్టు మేము మర్చిపోయే స్థితికి దిగజార్చి ప్రజలవద్ద తలదించుకునే పరిస్థితి కల్పించిన
మీకు వోటు అనే ఆయుధంతో గట్టిగానే బుద్ది చెప్పాములే.
5. నమస్తే అయ్యా. మేము రాయలసీమ రైతులం. హంద్రీ -నీవా, గాలేరు-నగరి కాలువల వ్యవస్థ పూర్తిచేయకుండా , వైస్సార్ హయాంలో పూర్తిఅయ్యిన జలాశయాలకు కొద్దిగా మేకప్ అద్ది నీళ్లు పారించి గొప్పలు చెప్పటం మీకే చెల్లు. రమారమి 3000 పైచిలుకు చెరువులు వున్నా అనంతపూర్ జిల్లాలో కేవలం 30 చెరువులకు నీరిస్తే సరిపోతుందా? డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ లేకుండా నీరు ఎక్కడికి పారుతుంది?
రాజకీయాలకోసం
రైతుల పొలాళ్ళో పారవలసిన నీళ్లు
ఆవిరైనా పర్వాలేదు అనుకొనే మీకు మా ఓటుతో గట్టిగా బుద్ది చెప్పాములే.
6. బాబుగారూ, తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతం వారంతా మీకే ఓటేశారని రోజూ చెప్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాతా వచ్చిన GHMC, తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా మీరు నందమూరి ఆడపడుచును రంగంలోకి దించినా, మేము ఓట్లు ఎవరికి గుద్దామో మీకు తెలియంది కాదు. కెసిఆర్ తో మీ పొత్తు ప్రయత్నం బెడిసికొట్టిన తర్వాత , వారిపై దుమ్మెతిపోయ్యడం, దానిలో సెట్ట్లెర్స్ ని పావులుగా వాడుకోవాలని మీరు చేసిన దుర్మార్గపు ఆలోచనలు గ్రహించలేనంత అమాయకులం మాత్రం కాదు.
మీరు చెప్పినట్టు రైళ్లల్లో, బస్సు ల్లో, కార్లలో, ఇంకా దొరికిన ఏ వాహనం అయ్యినా పట్టుకొని సంక్రాంతి సంభరంలా ఆంధ్రాకి వచ్చాం. వచ్చింది మాత్రం మీమీద ప్రేమతో కాదు, కసితో. మా తల్లితండ్రులు, బంధుమిత్రులకు మీరు తెలంగాణలో ఆడిన నాటకాలు, మాకు కల్పిస్తున్న అభద్రతాభావం గురించి వివరంగా చెప్పి , మా ఓట్లే గాక ,మా వాళ్ళ ఓట్లు కూడా గంపగుత్తగా మీకు వ్యతిరేకంగా వేయించి మా కోపానంతా తీర్చుకొన్నాం.
7. డ్వాక్రా రుణమాఫీ, సున్నావడ్డీ అని మాయమాటలు చెప్పి, పావలా వడ్డీకి కూడా మంగళం పాడి, మా డ్వాక్రా సంఘాల వ్యాపారం నాశనం చేసి, ఎన్నికల ముందు
పసుపు-కుంకుమ, ఉగాది కానుక, వంకాయ పచ్చడి అంటూ మా మొఖాన చిల్లర విదిల్చి ఓట్లు దండుకోవాలన్న మీ దుర్మార్గపు ఆలోచన గ్రహించి, మీరు ముద్దుగా పిలుచుకునే కోటిమంది చెల్లెమ్మలం మీకు వోటు వేయలేదు
అన్నయ్యా . మనవి అనుబంధాలు లేని బంధాలు కదా.
ఎన్నికలు జరిగిన రోజే, చాలామంది తెలుగు తమ్ముళ్లు కాడి క్రింద పడేశారని విన్నాం.
ఇప్పుడు మీరు మనకి అండర్ కరెంటు ఉంది,
చెల్లెమ్మలు మనకి బాగా వేశారు, సమీక్షలు అంటూ , ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు తమ్ముళ్లను పంటిబిగువన నిలబెట్టే వృధా ప్రయత్నం చేస్తునట్టున్నారు . మేమైతే జగన్ గారి డ్వాక్రా రుణమాఫీ హామీని నమ్మి వారికే వేసాం ఓట్లు. జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అన్న నమ్మకం తో ప్రతి నెలా బ్యాంకులో కట్టే వాయిదా డబ్బు ఈ నెల ఎక్కువమంది కట్టలేదు కావాలంటే బ్యాంకుల్లో చూసుకోండి.
తమ్ముళ్లూ, మన అన్నగారు పదే పదే చెల్లమ్మలు వేశారు కాబట్టి గెలుస్తున్నాం అని చెపుతున్న మాటలు నమ్మి మీరు మోసపోకండి. ఇప్పటివరకు జరిగిన నష్టం చాలు, పందేలు కాసి ఇంకా నష్టపోకండి. మమల్ని నిందించకండి.
8. బాబు గారు మేము మీ యాదవ
సోదరులం. ఎన్టీఆర్ గారు మాకు తగు గౌరవం ఇచ్చి కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. కానీ
మీరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సనత్ నగర్ నుండి పోటీ చేసిన మా కులనాయకుడు, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ని ఓడించడానికి, ఆంధ్ర ప్రాంతంనుండి మీ సామాజిక
వర్గ సీనియర్ నాయకున్ని, డబ్బు సంచులు, మంది
మార్బలంతో పంపడం, వాళ్ళు పోలీసులకు చిక్కి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పరువు బజారుకీడ్చిన
తీరు మంచిగా అనిపించలేదు. ముఖ్యంగా యాదవులు
,వెనుకబడిన వర్గాలపై వారిపై మీకు కపట ప్రేమ తప్ప
నమ్మకం లేదని ఈ సంఘటనతో తేలిపోయింది. అందుకే తెలుగు రాష్ట్రాలలోని యాదవులంతా
ఏకమై, మీ పార్టీని ఓడించాలని అని నిర్ణయించుకొని ఫ్యాన్ గుర్తుకి వేశాం ఓట్లు.
9. నమస్తే నాయుడు గారు. మేము మీరు పూర్తిగా మర్చిపోయిన నాగార్జునసాగర్ ఆయకట్ట
రైతులం. పట్టిసీమ,రాయలసీమకు నీరు అంటూ కేవలం రాజకీయాలకోసం నీరు వృధా చేయడం,కాలువల వ్యవస్థ పటిష్టంగా వున్నా, గత 3ఏళ్ళుగా చుక్క నీళ్లివ్వకుండా మా ప్రాంత రైతులను నిలువునా ముంచడం మీకే చెల్లు. ఆఖరికి రైతుల పొట్టకొట్టి, పుష్కరాలకు నీళ్లిచ్చి, ఆ నీటిని సముద్రంపాలు చేసిన మీలాంటి రైతు ద్రోహికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పటంతప్ప మేమింకేమి చేయగలం.
10. నమస్తే నాయుడు సాబ్ మేము
ముస్లిం సోదరులం. మీకు మాపై ఎంత ఘాటుప్రేమో తెలియంది కాదు. బీజేపీతో మీ కాపురం కూలినప్పుడు మాత్రమే మేము గుర్తుకొస్తుంటాం.
మా ఓట్లు దండుకోవాలనే దురుద్దేశంతో మీరు మోదీని తిట్టిన తీరు, జగన్ మోదీ జోడి అని మమ్మల్ని
నమ్మించడానికి చేసిన ప్రయత్నం తెలుసుకోలేంత అమాయకులం కాదు. 2014 లో బీజేపీతో జత కడితే
ఖచ్చితంగా గెలుస్తామని అని తెలిసికూడా మమల్ని వదులుకోని వైస్సార్ బిడ్డ జగన్ ని కాదని
నిన్నెలా నమ్మామనుకున్నావు? మా ఓట్లన్నీ ఫ్యాన్ కి గుద్ది కసి తీర్చుకున్నాములే.
11. బాబు గారూ
మేము ఈవీఎంలం. టెక్నాలజీ నేనే తెచ్చాను, టెక్నాలజీ నాకు దాసోహం అని గొప్పలు
చెప్పుకొనే మీ మానస పుత్రికలం. సందు దొరికినప్పుడల్లా మమ్మల్ని
విపరీతంగా పొగిడితే మా బాబు బంగారం అనుకొన్నాం. వెంకి పెళ్లి సుబ్బి చావు కొచిందన్నట్టు, బీజేపీతో మీ కాపురం కూలిన తర్వాత, వారినేమిచేయలేక మీ కోపతాపాలు మా మీద చూపించడం, ఇంత అనుభవమున్న మీరు చేయవలసిన పనేనా సార్? మాకు ఇంటర్నెట్ కనెక్టివిటీ సదుపాయంలేదు, మమ్మల్ని హాక్ చేయొచ్చు అంటారేంటి సార్. పాల్ గారు 2 నొక్కితే
12 కి పోయింది అంటే పిచ్చిముదిరి పాకానపడిందనుకున్నాం, మీరు కూడా సైకిల్ నొక్కితే కమలంపై పడుతుంది అంటుంటే ఏమనాలో అర్థం కావడంలేదు.
ఎన్నోసార్లు ఎంతోమంది ముందు నిలబడి, ఎన్నో పరీక్షలు పాసై
మా ప్రాతివత్యాన్ని నిరూపించుకున్నాం. దయవుంచి మమ్మల్ని కించపరచకండి. రాజకీయనాయకుళ్ళా మాట మార్చడం, వెన్నుపోట్లు పొడవడం, అవకాశవాదం మాకు చేతకావు. మనసున్న మంచి మనుషులం కాకపోయినా నిక్కచ్చిగా పనిచేసే మెషిన్స్ మి
అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ప్రజలు ఏ గుర్తుపై వేసిన ఓటును ఆ గుర్తు ఖాతాలో జమచేసి భద్రంగా మా కడుపులో దాచుకొన్నాం. మే 23వ కౌంటింగ్ ద్వారా వచ్చే ప్రజా తీర్పుని గౌరవించి, మమ్మల్ని నిందించకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి.
12. ఒక పెద్దకొడుకులా మా అవసరాలు గ్రహించి అవ్వా తాత పింఛన్లు
వెయ్యి నుండి రెండు వేలకు పెంచినందుకు నిండుగా ఆశీర్వదించాం. అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా
ఒక పార్టీ వారికే కొమ్ము కాసి మాలోమాకే తగువులు పెట్టిన తీరు, ఎన్నికలు వస్తున్న సమయంలో గేట్లు తెర సిన పద్ధతి, జన్మభూమి కమిటీ
సభ్యులు వసూళ్లు గుర్తుకొచ్చి మీపై ప్రేమను ఆవిరిగా మార్చాయి. 15 ఏళ్ళనాడే మా అవసరాలు గుర్తించిన రాజన్నను, అధికారమిస్తే పింఛన్లు పెంచి ఇవ్వడమే కాదు , కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను అన్న మా రాజన్న బిడ్డ మాటలు గుర్తుకొచ్చి మా వేలు ఫ్యాను గుర్తు పైకి వెళ్ళింది. మన్నించండి నాయుడు గారు.
13. నమస్తే బ్రదర్, మేము రైతన్నలం. 2014 ఎన్నికల సందర్భంలో మీరు అధికారంలోకి వస్తే వర్షాలు పడవు, పడ్డా నీళ్లు నిలబడవు, ప్రాజెక్టులు నిండవ్వు, కరువు తాండవిస్తుంది అని మా తోటి రైతులు చిలుకకు చెప్పినట్టు చెప్పినా మీ కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోయాం.
ఈ 5 ఏళ్ళు కరువు, కాటకాలతో , పంటలు పండక, గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడ్డాం. ఇంకా మిమ్మల్ని భరించే ఓపిక మాకు లేదు. అందుకే రైతులందరమి సమిష్టిగా ఒక నిర్ణయానికి వచ్చి ఫ్యాన్ గుర్తుకి వోట్ వేసాం.
14.నాయుడు గారూ గుర్తున్నామా, మేము అలనాడు అన్నగారు
నిండుగా పిలుచుకొన్న తెలుగు తమ్ముళ్ళం. తెలుగుదేశం పార్టీకి కట్టు బానిసలం. కాలక్రమేనా సైకిల్ కి టైర్ మార్చుకొనే స్థితి లేక, ఆఖరకు కొత్త పచ్చ చొక్కా కూడా కుట్టించుకోలేని పరిస్థితి మా నిజాయతీకి నిదర్శనం. కొత్తగా వచ్చిన తమ్ముళ్లు ఇసుక, మట్టి , ఒకటేమిటి దొరికిందల్లా దోసుకొంటూ సైకిల్ నుండి పెద్ద కార్ల స్థితికి ఎదిగిన తీరు, వారితో పోల్చి ఇంట్లో భార్యా పిల్లలు మమ్మల్ని చూస్తున్న చూపులు మాలో తెలియని ఉద్వేగాన్ని రేపి , అసలు ఇప్పుడు మనం ఉన్నది అన్నగారు, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి స్థాపించిన టీడీపీ తోనేనా అన్న అనుమానాన్ని కలుగచేశాయి.
మా పిల్లలు మార్పు అవసరం అని చెప్పిన
మాటలు
మాలో ఆలోచనను కలుగచేసి ఫ్యాన్ గుర్తుకి వోటు వేయించి, బానిసత్వం నుండి బయట పడేశాయి. మమ్మల్ని మన్నించండి.
15. నాయుడు బావగారూ , సంపూర్ణ రుణమాఫీ, ఎటువంటి రుణమైనా కట్టక్కరలేదన్నావు, అప్పు ఎంతయినా నాది బాధ్యత అన్నావు. మాకు అనుమానం వచ్చినా , అనుభవజ్ఞుడుకదా చేస్తాడులే అనుకొని ఓట్లు సైకిల్ కి వేసి గెలిపించుకున్నాం. కానీ మీరు లక్ష వరకే మాఫీ చేస్తాను, అన్నిరకాల రుణాలకు వర్తించదు, 5 కిస్తీలలో ఇస్తాను అంటూ కేవలం 3 కిస్తీలు ఇచ్చి , మిగిలిన 2 కిస్తీలు మొన్న ఎన్నికల ముందు ఇస్తున్నానని చెప్పి, వడ్డీలు పెరిగి భారంగా మారి
మళ్లీ
బ్యాంకులో అప్పు పుట్టకుండా చేసి నమ్మించి నిలువునా ముంచారు. చేతకాని హామీలు ఇచ్చి మోసం చేయడం, వ్యవస్థలను పాడు చేయడం మంచిపని కాదు. "అన్నదాత - సుఖీభవ" అంటూ మోసం చేయాలనే ప్రయత్నానికి
మరొకసారి బలి అయ్యేటంతటి అమాయకులం కాదు.
"చేయలేనిది చెప్పను- చెప్పింది తప్పకుండా చేస్తాను" అని చెప్పిన జగన్ గారిని పూర్తిగా నమ్మి ఈసారి వారికే వేసాం మా ఓట్లు.
16. మేము క్రిష్ణానది దిగువప్రాంత లంక రైతులం. వరదలొచ్చినప్పుడు భూములు కోతకుగురై తీవ్రంగా నష్టపోయివున్నాం. అట్టి లంకల్లో నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఇసుక తరలించడానికి అనుమతులు ఇచ్చి మాకు మానసిక క్షోభ కలుగచేసారు. మీరు ప్రెస్ మీట్లు పెట్టి అక్రమ ఇసుక త్రవ్వకాలు నేను సహించను, అట్టి వారిని PD యాక్ట్ లో బుక్ చేసి జైలుకి పంపుతానంటే నిజమే అనుకున్నాం. మీరు సృష్టించిన 1100, RTGS, KAIZALA, సీఎం డాష్ బోర్డు లాంటివి కేవలం మీ పబ్లిసిటి
పిచ్చికి తప్ప, ప్రజా సమస్యలు తీర్చడానికి కాదు అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నిజం చెప్పాలంటే ఇసుక దొంగతనం చేసిన వారి మీదకంటే, ప్రజలపై కపట ప్రేమ నటించి దోచుకొనే వ్యవస్థకు కొమ్ము కాసిన మీపై మాకు కసి పెరిగింది. ఒక మంచి మనిషి సహకారంతో , మీ వ్యవస్థపై పోరాడి ఇసుక త్రవ్వకాలు ఆపించ కలిగాం. మొన్న జరిగిన ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మా కసిని తీర్చుకొన్నాం.
17.
బాబుగారూ మేము మీ పార్టీ అభిమానులం. మీమీద నమ్మకం తో
ఎన్టీఆర్ గృహపధకంలో ఇండ్లు
బుక్ చేసుకున్నాం. జగన్ గారు పేదల గృహ నిర్మాణ పధకంలో ఎంతో
అవినీతి జరిగింది , మీ సహకారం , దేవుని దయతో మనందరి పార్టీ అధికారంలోకి వస్తే ,
ఇంటి మీద రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తానంటే రాజకీయమనుకొన్నాం. మీరు కూడా , చెల్లెమ్మల కస్టాలు చూసాను, అందుకే ఇల్లు ఉచితంగా ఇస్తానంటే, ఇందులో ఏదో మతలబు ఉందని గ్రహించి విచారించాం. నెల్లూరు లాంటి టౌన్ లో మీరు కడుతున్న లాంటి ఇల్లు చ. అడుగుకు రూ 2700 నుండి 3000 కి దొరుకుతుంది. కానీ మీరు ప్రభుత్వభూమి ఇచ్చి , ఇంకా సదుపాయాలకు అదనంగా ఖర్చుపెట్టి, కాంట్రాక్టరుకు చ. అడుగుకు రూ 2700/- ఇస్తున్నారని తెలిసింది. అంటే అన్నీకలిపి చ. అడుగు రూ 4700/- ప్రభుత్వానికి గిట్టిందన్నమాట. అదనంగా ఖర్చు చూపుతున్న రూ 1700/- ఎక్కడకి వెళ్తున్నట్టు?
మీరు మామీద భారం మోపడం లేదు, ప్రభుత్వమే భరిస్తుందికదా అనొచ్చు. ఇలాంటి కార్యక్రమాలు చేయబట్టేకదా రాష్ట్ర అప్పు 3 లక్షల కోట్ల పైకి చేరింది. ఇలాంటి పాపంలో మాకు భాగం వద్దనుకొన్నాం. మా కళ్ళు తెరిపించిన జగన్ ను మనసారా దీవించి ఫ్యాన్ గుర్తుకి ఓటేశాం.
18. నమస్తే అల్లుడు గారు. మా కృష్ణాడెల్టా అల్లుడు ముఖ్యమంత్రి అంటే చాలా సంతోషించాం. వైస్సార్ గారు కృష్ణాడెల్టా స్థిరీకరణ కొరకు చేపట్టిన పులిచింతల ప్రాజెక్ట్ పనులు 95% పైన పూర్తిఅయ్యిన నేపథ్యంలో మీరు మిగిలిన కొద్దీ పని పూర్తి చేసి మాకు మేలు చేస్తారనుకున్నాం.
కానీ మీరు పులిచింతల మాటే ఎత్తకుండా, కేవలం మీ ఆర్ధిక, రాజకీయప్రయోజనాలకోసం పట్టిసీమ కట్టాను , నదుల అనుసంధానం చేశాను,
కృష్ణాడెల్టాలో పంటలు కాపాడాను, సంపద పెంచాను, రాయలసీమకు
నీళ్లు ఇచ్చాను అంటూ ఉపన్యాసాలు దంచి
మమల్ని ఇతర ప్రాంతాల రైతుల ద్రుష్టిలో అవకాశవాదులుగా చిత్రీకరించారు. కృష్ణ డెల్టాకి కరువేంటి, మీరు మా పంటలు కాపాడటమేంటి? వింటే ఎవరన్నా నవ్విపోతారు.
అమ్మ నాయుడు గారు, మామ గారికే వెన్నుపోటు పొడిచిన మీకు మేమెంత. మిమ్మల్ని అల్లుడుగారు అనుకోవడం మా పొరపాటు. అందుకే మా ఓట్లన్నీ ఫ్యాన్ గుర్తుకి వేసి మీపై మా నిరసన తెలియజేసాం.
19. నాయుడు గారూ ఎవరు ఓట్లు వేయలేదని బాధ పడకండి, మేమున్నాం మీకు అండగా.
తుళ్లూరు ప్రాంతంలో రాజధాని వస్తుంది అని లీకులిచ్చి, తక్కువ ధరకు భూములేకాక , అసైన్డ్ భూములు
అణగారిన వర్గాలనుండి అతితక్కువ ధరకు గుంజుకొనే అవకాశం కల్పించిన మిమ్మల్ని ఎలా మర్చిపోగలం. స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇతర రాష్ట్ర ప్రయోజనాలు ఢిల్లీ దర్బారుకి తాకట్టు పెట్టి, మనలాంటి వాళ్ళకోసం రాజధాని భూములకు కాపిటల్ గైన్ టాక్స్ రద్దు చేయించి, లక్షలాది కోట్లు నల్లడబ్బు అధికార కరెన్సీగా మార్చుకొనే అవకాశంతో పాటు, వేలాది కోట్లు టాక్స్ ఆదాచేసిన మీ ఋణం ఏమిచ్చి తీర్చుకోగలం.
మా వోట్లని మీకే గుద్దామ్. కానీ వందల సంఖ్యలో వున్న
మా ఓట్లు మీకు ఏమాత్రము పనికి రాక పోవచ్చు. కొద్దిపాటి సముద్రజలం మంచి నీటి సరస్సుని చెరుపలేదు కదా. మీకు అవకాశముంటే ఆస్తినిబట్టి ఓటుకి విలువ అని చట్టాన్ని తీసుకురండి. అప్పుడు చూపిద్దాం మన తడాకా.
20. బాబు గారు గోదావరి పుష్కరాలని
మీరు మర్చి పోయారేమోకాని, మేము ఎన్నటికీ మరువలేము. మీ ప్రచార ఆర్భాటానికి సామాన్యప్రజలు కిటకిటలాడే పుష్కర్ ఘాట్లో సినిమా షూటింగ్ పెట్టుకొని తొక్కిసలాటలో 29 మంది చనిపోవడం చూసి గుండె చెలించింది. వేలకోట్లు కుమ్మరించి చేసిన ఏర్పాటులో భాగమైన సీసీటీవీ కెమెరాలు , తొక్కిసలాట దృశ్యాలు చిత్రీకరించలేదు అంటే నమ్మశక్యంగాలేదు. జీవం లేని కెమెరాలను అనుకూలంగా మరల్చుకున్నవారికి , చేతలు నేర్చిన మనుషుల్ని తమవైపు తిప్పుకోవడం సాధారణం అనుకొని, సామాన్య ప్రజలకు మీ ప్రభుత్వంలో న్యాయం జరగదు అనుకొన్నాం. మాలో పేరుకుపోయిన ఆవేశాన్ని వోట్ అనే ఆయుధంతో తీర్చుకొన్నాం.
21. బాబూజీ కెమిటి అచంటి. మేము ఒడిశా, జార్ఖండ్ ,బీహార్ నుండి దినసరి కూలికి వచ్చిన బీదవాళ్లం. మేము పనిచేస్తున్న
నిర్మాణరంగ కంపెనీలు బ్యాంకు అకౌంట్, అడ్రస్ ప్రూప్, ఆధార్ అన్నీ
ఏర్పాటుచేస్తే ఎంత మంచి వాళ్లో
అనుకున్నాం. ప్రేమంతా మా మీదకాదు , మాకు ఇక్కడ ఓట్లు పుట్టించి మమ్మల్ని వాడుకోవడానికి , అది క్రమేణా పెద్ద చర్చకు కూడా దారితీసిందని తెలిసి చాలా మధనపడ్డాం.
కానీ బయటికి చెప్పుకొనే ధైర్యం లేని వాళ్ళం.
ఇక్కడ
అధికారంలో ఉన్న వారు, బీదవారిని చాలా ఇబ్బంది పెడుతూ
హీనంగా చూస్తున్నారు అని మా తోటి పనివారినుండి తెలుసుకొని , వారి కోరిక మేరకు మీ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టడం ఇష్టంలేక వోటింగ్ కి దూరంగా ఉన్నాం. మాకున్న ఇబ్బందులవల్ల మీరిచ్చిన
తాయిలాలు
తీసికొని ఉండవచ్చు, మన్నించండి.
22. నీ హవో మా సర్.
మేము మీ సింగపూర్ చీకటి మిత్రులం.
మీ రాజధాని నడిబొడ్డున 1691 ఎకరాలు కేవలం 306 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్దమైన సింగపూర్ గ్రూపుకు 58 % వాటా , అనుకూలమైన అన్ని నిభందనలు , ముఖ్యముగా కోర్ట్ వ్యవహారాలు లండన్ లో అనిపెట్టి, స్విస్ ఛాలెంజ్ ముసుగులో మాకు దారాదత్తం చేసిన, మీ సింగపూర్ దేశభక్తికి పూర్తిగా దాసోహం. ఈ ప్రాజెక్టుకి భూమి ఇచ్చిన ప్రాంతంలో మౌలిక సదుపాయాలకు 5500 కోట్లు వెచ్చించడాని ఒప్పుకొని, ప్రాజెక్టులో నియంత్రణ అధికారం పూర్తిగా మాకే ఉండే అంతటి భాగస్వామ్య హక్కులు కల్పించిన మీరే, మళ్ళీ
మళ్ళీ అధికారంలోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకొన్నాం. వేద్దామంటే మాకు ఓట్లు లేవు , వందల సంఖ్యలో వున్న మా ఉద్యోగులు మీకు వేసినా పెద్ద ప్రయోజనం లేదు. మీకున్న ప్రజావ్యతిరేకత గురించి విన్న తరువాత మాకెక్కడో కారిపోతుంది.
అందరూ
మీ రాష్ట్రంలో ఉన్న తిరుమలలో నిలువు దోపిడీ ఇస్తారు. మీరేమో మీకిచ్చారు. విధి రాతను ఎవ్వరు తప్పించగలరు.
23. నాయుడు గారూ బాగున్నారా. మేమండి తెల్లతోలు ముసుగులో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం నుండి అమరావతి భవన నిర్మాణందాకా కీలకమైన అనేక నిర్ణయాలకు మూల స్తంభాలుగా వ్యవహరిస్తూ
కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న వాళ్ళం. ఒకవైపు మేక్
ఇన్ ఇండియా, స్థానిక ప్రతిభ అంటూ, వేలకోట్లు బహుళజాతి సంస్థలకు దోచిపెట్టే మీకు మేము ఎప్పటికీ గులాములమే. దశాబ్దాలుగా ఉన్న మీ దేశ మేధోసంపక్తిని మాకు దాసోహం చేసి, మీ భవిశ్య అవసరాలకుకూడా మా మీద ఆధారపడే వ్యవస్థకు శ్రీకారం చుట్టిన మీ విదేశీ భక్తికి మెచ్చి మీకే ఓట్లు వేద్దాం అనుకొన్నాం. కానీ మీపైవున్న ప్రజావ్యతిరేకత చూసిన తరువాత పునరాలోచన చేసుకున్నాం. మమల్ని మన్నించండి.
24. రాష్ట్రపోలీసులుగా ప్రజలకు పారదర్శకతతో సేవలందించడం మా కర్తవ్యం, కానీ ఆ భాగ్యం మాకెలాగూ
లేదు. తుని రైల్ ఘటన, రాజధాని చెరుకు తోటలు తగలబెట్టడం, స్పీకర్ గారు ప్రధాన ప్రతిపక్షం వారు
అసెంబ్లీ బిల్డింగ్ లో పైపులు కోశారనడం,
పుష్కరాల్లో తొక్కిసలాట దృశ్యాలు CCTV చిత్రీకరించక పోవడం లాంటి సంఘటనలు నిరూపణ చేయలేక పోవడం , మమ్మల్ని
ప్రజల దృష్టిలో నేరస్థులుగా నిలబెట్టాయి.
మీరు గొప్పగా చెప్పుకొనే
సాంకేతిక నిపుణత, సుపరిపాలన ఇటువంటి సంఘటనలను కూడా ఏళ్ళు గడుస్తున్నా పట్టుకోలేదంటే ప్రజలు నమ్మటం లేదు. మీ రాజకీయ క్రీడకు
మమ్మల్ని బలిపశువుల్ని చేయడం దారుణం. నోరులేని మేము ప్రజాస్వామ్యంలో వోట్ అనే ఆయుధంతోనే
తీర్పు చెప్పగలం.
25. నీతి నిజాయతి ఉన్న అధికారులు కాగడా పెట్టి వెతికినా దొరకని రోజులు. ఒక మహిళ , అందులోనూ బడుగు బలహీన వర్గాలకు చెందిన తహశీల్ధార్ , విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తూ , వివాదాలకు మారుపేరైన
పాలక పక్షనాయకుడిని
ధైర్యం గా
అడ్డుకొంటే చాలా
సంతోషించాం. గట్టి చర్యలు తీసుకుంటారని భావించిన మీరు,
ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా పంచాయతీ చేసి,ఏదో కుంటి
సాకులు చూపి అధికారిణిని మందలించడం , ఆరనిముషంలో
మా సంతోషాన్ని
ఆవిరిచేసింది. ఇది సుపరిపాలన, సాంకేతిక విప్లవం, నిజ సమయ పాలన, అనుభవంలో సరిలేరు నాకెవర్రు అని విర్రవీగే మీరు చేయవలసిన పని కాదు.
పొరపాటు ఏదో జరిగింది మర్చిపోదాంలే అనుకొంటే, ఇల్లాంటి మరికొన్ని సంఘటనలు ముసుగులో ఉన్న మీ నిజ స్వరూపాన్ని బయటపెట్టాయ్యి. కులమతాలకు అతీతంగా మంచి పరిపాలన కావాలి అని కోరుకొనే మా లాంటి లక్షలమంది మధ్యతరగతి ప్రజలను మీరు తీవ్రంగా నిరాశ పరిచారు. మన రాష్ట్రానికి నాయకత్వ మార్పు అనివార్యం అని మమల్ని నిర్ణయించుకొనేలా చేసాయి.
26. థాంక్స్ నాయుడు గారూ మా కళ్ళు తెరిపించారు. వైస్సార్ గారంటే ఎంత ప్రేమ ఉన్నా, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాం. తెలంగాణాలో మమ్మల్ని ముగ్గులోకి దించి, మీమీద ఉన్న వ్యతిరేకత మాకు తగిలించి పూర్తిగా ముంచేశారు. సంసారం గుట్టుగా సాగుతుందనుకొంటే
మన రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్తు లేదని మమల్ని పూర్తిగా నడిరోడ్డు మీద వదిలేసారు . కొద్దొ గొప్పో
గౌరవం
మిగిలివున్న కోట్ల, కురుపాం కుటుంబాలను మీ కుళ్ళు రాజకీయ క్రీడకు బలిచేసి కాంగ్రెసును భూస్థాపితం చేశారు.
మీరంటేసరి, ఇలాంటివి మీకు సర్వసాధారణం, మా నాయకులకేమైంది?
ఓట్లు పరంగా మేము కొద్ధిశాతం మాత్రమే కావచ్చు. కానీ మాకు స్పష్టత వచ్చి, కాంగ్రెసుతో పాటు మిమ్మల్ని కూడా భూస్ధాపితంచేసి దెబ్బకు దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నాం. మా ఓట్లు మొత్తం ఫ్యాన్ గుర్తుకు కసిగా వేసాం.
27. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వొద్దంటుందా, ఎంపిక చేసుకొనే అవకాశంవుంటే దళిత కుటుంబంలో పుట్టాలని ఏవరైనా కోరుకొంటారా అని మీరు హేళన భావంతో చేసిన వ్యాఖ్యలు, మీలోని జాతి వివక్ష, అహంకారానికి నిదర్శనం. ఖచ్చితంగా మీలాంటి
సీనియర్ రాజకీయనాయకుడు మాట్లాడవలసిన మాటలు కావు. మీ నిజ స్వరూపాన్ని అర్థం చేసికొన్న బుద్ధి , ఆలోచన ఉన్న దళితులెవ్వరైనా మీకు ఓట్లు వేశారని అనుకుంటున్నారా?
28. చంద్రబాబు గారు మీరు మాకు తీరని అన్యాయం చేశారు. కడప జిల్లాలో
మా పద్మశాలి కులానికిచెందిన మీ పార్టీ నాయకులు , బడా బాబులతో కుమ్మకై ,బోగస్ చేనేత సంఘాలను పుట్టించి, స్కూల్ యూనిఫామ్, పోలీస్ యూనిఫామ్ కు కోట్ల రూపాయల చేనేత వస్త్రాలు, కుట్టు పని ఆర్డర్లు పొంది , మరమగ్గాల బట్ట కారుచౌకగా కొని , దొంగ బిల్లులు
సృష్టించి , కోట్లు దండుకున్న విషయం మీకు తెలియ్యంది
కాదు.
వీరి అక్రమాలకు వేలాది నేత కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ సుపరిపాలన, నిజ సమయ పాలన వ్యవస్థకు ఇవి
తెలియలేదంటే నమ్మేటంతటి వెర్రి వెగళప్పలం కాదు. ఎందుకండీ ఇలా ప్రజల చెవ్వుల్లో పువ్వులు పెట్టి చెక్క భజన చేస్తూ టెక్నాలజీని నవ్వులపాలు చేస్తారు?
ఫ్యాన్ కి వోట్ వేసి , ముఖ్యంగా మా పద్మ శాలీలు అధికంగా వున్న మంగళగిరి, ధర్మవరం లాంటి ప్రాంతాలలో మా సత్తా చూపాం.
29. 1999లో బీజేపీ, ముఖ్యంగా
వాజపేయిగారి గాలి ఉందని తెలుసుకొని మీతో అంటకాగుతున్న
కమ్యూనిస్టులు,జనతాదళ్ లాంటి వాళ్ళని వదిలించుకొని, మా పంచన చేరి, వైస్సార్ నాయకత్వంలో
బలంగా వున్న కాంగ్రెస్ ని మట్టి కరిపించావు. మా పార్టీలోని మీ పెద్దల సహకారంతో అనేక
లాభాలు పొందటమే కాకుండా బీజేపీని రాష్ట్రంలో ఎదగకుండా చేసావు. మీ మీద హత్యాప్రయత్నం
జరిగింది కాబట్టి, సానుభూతి కలిసివస్తుంది అని నమ్మబలికి 2004లో ముందస్తు ఎన్నికలకు
ఒప్పించి, జనరంజక పాలన అందించిన వాజపేయి గారినికూడా మీతో పాటు సాగనంపిన అప్రసిద్దమైన నాయకులు మీరు. ఓటమికి కారణాలు మాపైకి
నెట్టి మీరు కూటమినుండి వెళ్ళిపోతే చాలా ఆనందించాం.
20149లో మరోసారి మామీ పెద్దల
సహకారంతో ఇంకో సారి మాతో జతకట్టి, మోదీగారి ప్రజాదరణ జోడై స్వల్ప ఆదిక్యతతో బయటపడ్డావు.
అవినీతి రహిత పాలన అందించాలని కంకణం కట్టుకొన్న
మోడీగారిని పోలవరం అంచనాలు భారీగా పెంచమని, సరైన జమ ఖర్చు వివరాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు
గురి చేసావు. మీతో వున్న గత అనుభవాలు తెలుసుకాబట్టి, మామీ పెద్దలు ఎంత కొమ్ము కాసినా, ఒత్తిడికి లొంగకుండా మీఅంతట మీరే నంబయటకు వెళ్ళేటట్టు చేసాం.
కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు
కాంగ్రెస్ ని దొరకబుచ్చుకొని , యూపీఏ , థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ అంటూ నిలకడలేని
పొత్తులు, మోడీపై వ్యతిరేకత మీరు విచక్షణ కోల్పోయి ప్రజలముందు దోషిగా నిలబెట్టాయి. బీజేపీ అభిమానులమైన
మేము, మీకు బీజేపీ/మోడీపై వున్నా కసికన్నా పదింతలు కసి పెంచుకొని మీరు ఓడిపోవాలి, మీ
వెన్నుపోటు రాజకీయ జీవితానికి చర్మ గీతం పాడాలిఅని నిర్ణయించాం.
30. మేము ధాన్యం పండించి, మీరు సృష్టించిన దళారీ వ్యవస్థ కోరల్లో చిక్కుకొని, దగాపడి
దివాలా తీసిన రైతులం. వెలుగు
కేంద్రాలద్వారా
కొనుగోలు చేస్తున్నామని చెప్పి, మమ్మల్ని చెప్పులు అరిగేలా తిప్పించుకొని , నిలువునా ముంచి కడకు రైస్ మిల్లర్లకు వారికి తోచిన ధర,
తరుగుకు ఒప్పుకొని మేమే
స్వంత ఖర్చులతో మిల్లుకి
తోలి దరిద్రం వదిలింది అనిపించే పరిస్థితి కల్పించిన మీదీ ఒక పాలనేనా?
డ్వాక్రా సంఘాల పేరుతో ఇసుక,
ధాన్యం ఒకటేమిటి ఏది దొరికితే అది దోసుకొనే చిల్లర దేవుళ్ళు కోకొల్లలుగా వెలిసి, ప్రజలను నిలువు దోపిడీ చేసినా మీ డాష్ బోర్డు దృష్టికి రాలేదంటే నమ్మమంటారా? ఇల్లాంటి బోగస్ వెలుగు సంఘాలు సృష్టించి, అద్భుతాలు సృష్టించాం అని చెప్పుకొని తిరుగుతున్న అధికారులు మాకేమి జవాబు చెబుతారు?
మా దగ్గర తక్కువ ధరకు కొన్న ధాన్యం , వెలుగు కేంద్రాల్లో దొంగ పేర్లతో నమోదు చేయించి MSPకి కొన్నట్టు లెక్కలు పుట్టించి
కోట్లు దండుకున్నారని తెలిసి కడుపు మండింది. ఇతర రాష్ట్రాల ధాన్యం , ఇక్కడి పంటగా చూపించడం, బియ్యం రీసైకిల్ చెయ్యడం, రవాణాలో
భారీ అవినీతి , ఒక్కటేమిటి , తవ్వినకొద్దీ అవినీతి పుట్టలే.
రెండు రోజుల క్రితం ఈనాడులో కధనం చూసిన తరువాత మీ పాలనపై పూర్తిగా రోత పుట్టింది. ఈనాడు
వారికి రైతు సమస్యలపై నిజమైన చిత్తసుద్ధి ఉంటే ఈ కథనాన్ని ఎన్నికల ముందు ప్రచురించి ఉండాల్సింది.
ఇంత దగా చేసిన మీకు మేము ఓట్లు ఎలా వేస్తామనుకున్నారు?
రైతులంతా నాకే గుద్దారు
ఓట్లు అని భాకా వూది ఎవ్వరి చెవ్వుల్లో పువ్వులు పెడుతున్నారు.
31. మేము ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాలకు చెందిన రైతులం. మూడు పంటలు పండే
భూములు, విజయవాడకు దగ్గరగా
ఉండటంవల్ల రేట్లు కూడా అధికంగా ఉన్నాయి మేము భూములివ్వం అంటే మామీద కక్ష కట్టావు. గతంలో పట్టణాభివృధి మంత్రిగా చేసిన పెద్దమనిసి , పదవి గౌరవం కాపాడుకోకుండా , భూములివ్వని రైతుల భూముల్ని హరిత జోన్ గా చెయ్యండి అని మీకు సలహా ఇచ్చాడంటే మీ వర్గానికి రైతులంటే ఎంత చిన్న చూపో తెలుస్తుంది. మా ప్రాంతాల్లో రవాణా జోన్ అని, ఇంకొక జోన్ అని మీరు ఎంత ఇబ్బందికి గురిచేసినా, ఋణం వడ్డీతో సహా తీర్చుకొనే అవకాశం కోసం ఎదురు చూసాం.
కలిచొచ్చే కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టు, మీ పుత్ర రత్నం మందలగిరి (మంగళగిరి) నుండి పూర్తి చేయడం , మాకు చక్కని అవకాశంగా కలిచొచ్చింది. మీ మీద వున్న పీకలలోతు కోపాన్ని ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేసి,
వేయించి తీర్చుకొన్నాం.
32. గ్రామాల్లో చెరువుల పూడిక తీస్తున్నారు అంటే ఎంతో సంతోషించాం. ఇష్టమొచ్చినట్టు కేవలం మట్టి అమ్ముకోవడానికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ గుంతలు పెట్టి , చెరువుకి నీళ్లు వచ్చే ఆకృతులను , మార్గాలను పరిరక్షించకుండా, ఉన్న చెరువులకు మంగళం పాడిన తీరు మమల్ని చాలా బాధించింది.
మా వూరి మట్టికి మేమె అధికధరలు చెల్లించడం ఒక ఎత్తు అయితే, మట్టిని త్రొమి బయటకు తరలించడానికి 12000 కోట్లపైన ఖర్చు చూపారంటే
మిమ్మల్ని దేనితో
పోల్చాలి.
మాకు అవకాశం ఇచ్చివుంటే, పద్దతిగా మట్టిపని చేసి మా పొలాలతో పాటు, చెరువుని బాగుచేసికొనేవారం. ఇల్లాంటి రైతులకు ప్రయోజనం కలిగే కార్యక్రమాలు చేపట్టలేని మీ జన్మభూమి ,
సుపరిపాలన , నిజ సమయ పాలన లాంటివి ఎవరి నెత్తిన టొపీ పెట్టడానికి? నీరు-చెట్టు కార్యక్రమములో ఉన్నతాధికారిగా పనిచేసిన పెద్దమనిషి,
మీ పార్టీ
అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేసి కోట్లు కుమ్మరించి ఓట్లు కొన్న తీరు మీ
పాలనలోని డొల్లతనానికి నిదర్శనం కాదా? జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్ల జేబులు భారీగా నింపి, మా నోట్లో మట్టి కొట్టిన మీకు మేము ఓట్లు ఎలా వేశామనుకొంటున్నారు?
33.
కృష్ణ, గోదావరి లాంటి నదులు ప్రవహిస్తున్నా రాష్ట్రంలో విపరీతమైన త్రాగు నీటి ఎద్దడి. పెద్ద నది నుండి చిన్న వాగు దాకా దేనినీ వదలకుండా , నది పరిరక్షణ,
నీటి పారుదల, వ్యవసాయ, రెవిన్యూ తదితర శాఖలను పచ్చ చొక్కాలకు జేబు సంస్థలుగా మార్చి ఇసుకను బొక్కారు.
ముఖ్యంగా పల్నాడ్, ఎగువ నెల్లూరు, ప్రకాశం , రాయలసీమ జిల్లాలో ఇష్టం వచ్చినట్టు ఇసుక త్రవ్వకాలు జరిపి , భూగర్భ జలాలు అడుగంటి , త్రాగు నీటి కోసం ప్రజలు విపరీతమైన ఇబ్బందులు పడే
పరిస్థితులు కల్పించిన మిమ్మల్ని
ఈ ప్రాంత ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. ఫ్యాన్ గుర్తు కి వోట్ వేసి, మీ రాక్షస పాలన ఇంకా ఎన్ని రోజులకు అంతమౌతుందా అని ఎదురు చూస్తున్నాం.
34.నమస్కారమండి. తెలుగుదేశం వీరాభిమానులం, మీ నాయకత్వాన్ని నమ్మినవాళ్ళం. తెలంగాణ ఎన్నికల్లో కూటమి గెలుస్తుంది , మనం కలవడంతో కాంగ్రెస్ దశ తిరిగింది, మన దశ మారింది
అని మీరు, కిట్టన్న ఊదరకొట్టారు. దానికి తోడు లగడపాటి వారి భామాకలాపం అంటూ బుల్లి తెరపై
పచ్చరంజకంగా రక్తి కట్టించి, మమ్మల్ని బెట్టింగ్ ముగ్గులోకి దించి, మాకు బారీనష్టాలు మిగిల్చి పెద్దలు బహు భారీగా సొమ్ము చేసుకొన్నారని తెలిసింది. ఘోరపరాజయంతో పాటు, డబ్బు కూడా భారీగా నష్టపోవడం కన్నా, పార్టీ పెద్దలు ముంచారు అన్నభావం ఎక్కువ ఆవేదన కలుగ చేసింది. రాష్ట్ర నాయకత్యం లో మార్పు వస్తేనన్నా , మా పార్టీ నాయకత్వంలో మార్పు వస్తుంది అని నమ్ముకొని ఈ సారి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసాం.
కానీ మీలో ఏకోశానా మార్పు రాక పోగా , ఓటమిని అంగీకరించకుండా రాహుల్ తో హనీ మూన్ చేస్తూ
, కేవలం మీ పుత్రరత్నం కోసం పార్టీని , కార్యకర్తలను బలిచేయడం భావ్యం కాదు. మళ్లి లగడపాటి వారి భూతుపురాణం ఇంకొక్క సారి విప్పి , తెలుగు తమ్ముళ్లను బెట్టింగ్ భాగోతంలో కట్టు బట్టలు కూడా లేని స్థితికి తీసుకురావాలనుకోవడం దారుణం. తమ్ముళ్లూ , మేము భారీగా నష్టపొయ్యాం, మీరు కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నచందంగా వ్యవహరించి
మోసపోకండి.
35. రాష్ట్రానికి భవిష్యత్తు యువత , యువతకు పెద్ద పీటవేస్తాను అంటూ కల్లబొల్లి కబుర్లతో మా ఓట్లు దండుకొని 2014లో అధికారంలోకి వచ్చి, మా ఆశలపై చన్నీళ్ళు చల్లడం మీకే చెల్లు. టెంపుల్ వచ్చింది, కియా వచ్చింది,
హీరో వచ్చింది, మీ పిండా కూడు వచ్చింది, అవిగో వెయ్యి ఉద్యోగాలు, ఇవిగో లక్ష ఉద్యోగాలు అంటూ మమల్ని మభ్యపెట్టి ,ఈ పేరుతో మీరు, మీ పుత్ర రత్నం, వందిమాగతులు ప్రపంచాన్ని
బొంగరంలా తిరిగిరావటం దేనికి నిదర్శనం. ఎన్నికలు వస్తున్నాయి , ఏదోవొకటి చేసి ఓట్లు దండుకోవాలి అని 2000 రూపాయలు నిరుద్యోగభృతి ఆఖరు క్షణంలో మాకు విదల్చడం, 18 ఏళ్ళు నిండిన యువతను కూడా కేవలం మీ ఓట్ల రాజకీయాలకోసం
సోంబేరులుగా చేయడం మీ 40ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవానికి పెద్ద మచ్చ.
జగన్ గారు , ప్రత్యేక హోదా కొరకు పోరాడుతుంటే హేళన చెయ్యడం , విద్యార్థులను జైల్లో వేస్తాను అని బెదిరించడం, చివరకు మీరు ధర్మపోరాట దీక్షలు అంటూ విచిత్ర విన్యాసాలు చేయడం మీలోని చిల్లర రాజకీయ నాయకున్ని ప్రపంచానికి చూపించింది. ఓపికతో భరించి వోట్ అనే ఆయుధంతో మీకు గట్టిగా బుద్ధి చెప్పాం.
36. చంద్రబాబు గారు,మీరు అతిగొప్పగా చెప్పుకొనే RTGS లో పని చేస్తున్న ఉద్యోగులం. ప్రశ్నలు ఇంత చెత్తగా వేయవచ్చా అని ఇక్కడకు వచ్చిన తరువాతే
తెలిసింది . మాతో చేయించిన భజనకు, వేసిన
తిక్క ప్రశ్నలకు ప్రజలు కడుపుబ్బా
నవ్వుకొన్నారు.
మేము చెప్పినా వినే ఓపిక, వివేకం
బట్రాజులాంటి
మీ ఉన్నతాధికారులకు లేవు . కుప్పంలో బల్బ్ వెలిగింది, కర్నూల్ లో ఎలుకలు పట్టాం,
నెల్లూరులో దోమలు చంపాం , ప్రజల్లో సంతోషం పొంగి పొర్లుతుంది అని వారు బాజా భజంత్రీలు వాయించడం ,మీరు కడుపసందుగా విని, తరించి భజనపరులను తక్కినవారికి ఆదర్శంగా చూపడం రాష్ట్రాన్ని " భజనాంధ్ర ప్రదేశ్" గా మార్చింది.
రాష్ట్రములో జరిగిన అవినీతి, అక్రమాలు, ఇసుక మట్టి దోపిడీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో విపరీతంగా పెంచిన
ఎస్టిమేట్స్ గురించి ఢిల్లీలో కోడై కూస్తున్నా, మీ ద్రుష్టికి
రాలేదంటే నెలలు నిండని పసిపిల్లవాడు కూడా నమ్మే పరిస్థితి లేదు. నిజసమయపాలన (RTGS ) పేరుతో
మీరు అతిగా నమ్మిన అధికారులు నిలువునా ముంచారో, లేదా మీరే ఊహా ప్రపంచంలో
తేలియాడుతూ వాస్తవాలకు దూరంగా ఉన్నారో భగవంతునికే ఎరుక.
మీ ఆధ్వర్యంలో జరిగిన " నిజసమయ పాలన" ను అతిదగ్గరగా
చూసిన మేము, మళ్ళీ
మీరే అధికారం లోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన ఇస్తరి
అవుతుంది అని తెలుసు కాబట్టి,
మేమె కాదు, మాకు తెలిసిన వాళ్లకు కూడా చెప్పి మరీ దగ్గరుండి ఫ్యాన్ కి ఓట్లు వేయించాం. మీరు నిబంధనలను పక్కనపెట్టి, మనవాళ్ళు అని ఉద్యోగాలు ఇచ్చినా , మీకు ఓట్లు వేయని మమల్ని మన్నించండి.
మీకు
" నిజసమయ పాలన" మీద నిజమైన ప్రేమ ఉంటె , ఒక సారి గుండె మీద చెయ్యి వేసుకొని మీరేమి చేశారో ఆలోచించుకోండి, మిమల్ని తప్పు త్రోవ పట్టించిన అధికారులను నిలదీయండి.
37. మీరు నందంటే నంది, పందంటే పంది అని నమ్మే మేము, సొంతంగా ఆలోచించడం ఎప్పుడో మర్చి పోయాం.
ఎన్నికల రోజు మీరు ఓటు వేచి వచ్చి , మధ్యాన్నం పైన ఈవీఎంలపై చేసిన వాఖ్యలు కొంప ముంచాయండి బాబు. మీ మాట తూచా తప్పక పాటించే మేము, సైకిల్ కి
నొక్కితే అక్కడ పడింది, నా వోటు
ఎక్కడ పడిందో నాకే తెలియదు అన్న మీ తత్వబోధనలు కడుచక్కగా పాటించి , సైకిల్ కి నొక్కితే కదా ఫ్యాన్ కి పడింది, కాబట్టి ఫ్యాన్ కి నొక్కుదాం సైకిల్ కి పడుతుంది అని నమ్మాము. ఈవీఎం స్క్రీన్ పై
ఫ్యాన్ చూపించినా, మీకొక విధంగా మాకొక విధంగా ఎలా కనిస్తుంది , అంతా భ్రమలే
అనుకోని , మీకు వంత పాడి మరీ ఫ్యాన్ కి గుద్దించామ్.
మీరు ఆడుతుందంతా
నాటకమని మా మట్టి బుర్రలకు లేటుగా వెలిగింది. రేపు జరుగపోయేది ఏమిటో తెలుసుకాబట్టి , "అంతా భ్రాంతియేనా జీవితాన
వెలుగింతేనా" అనే పల్లవి ఎత్తుకొని కాలం వెళ్లదీస్తున్నాము.
ఇక్కడ, ఢిల్లీ లోనూ మన పని గోవిందా కాబట్టి , ఏదన్నా
కొత్త భజన మొదలుపెడితే మంచి కాలక్షెపం. రేపటినుండి చేయవలసిందదే కదా.
చంద్రన్న రాజ్యం వద్దు- రాజన్న రాజ్యం ముద్దు. BGR/BBC
Comments