ఉందిలే మంచికాలం ముందూ ముందూనా
ఉందిలే మంచికాలం ముందూ ముందూనా 1.నమస్తే సర్ . మేము మండలస్థాయి ముఖ్య అధికారులం . ఉచిత ఇసుక విధానం ఎంతో పారదర్శకమైంది , రాజకీయాలకు సంభందం లేదు అని నమ్మించి , అధికారుల పేరుతో జీవోలు ఇచ్ఛి , క్వారీ ఆపరేషన్స్ పచ్చ చొక్కాలకు ధారాదత్తం చేసి , ప్రజల వద్ద , చట్టం వద్ద మమ్మల్ని దోషులుగా నిలబెట్టిన మిమ్మల్ని వోటు అనే ఆయుధంతో గట్టిగా శిక్షించాములే 2. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, మీరు పుట్టింది కూడా రాయలసీమలో అని మర్చి, రాయసీమ వాళ్ళు గుండాలు, అధికారమిస్తే అరాచకాలు సృష్టిస్తారు అని మన ప్రాంతాన్ని చిన్న చూపు చూసిన మిమ్మల్ని ఓటు అనే ఆయుధంతో గట్టిగా శిక్షించాములే. టాటా వీడుకోలు, ఇంక సెలవు. 3. నమస్కారమండి . కాపులకు రిజర్వేషన్స్ అని నమ్మించి గొంతుకోస్తే ఒప్పిగ్గా భరించాం . మా జాతి నాయకుడిని కిర్లంపూడిలో ఘోరంగా అవమానిస్తే కడుపులో దాచుకున్నాం . పవన్ పార్టీతో మీరు చెడుగుడు ఆడుకొని మమ్మల్ని సంతలో పశువులా చూసినా ఓపిక పట్టాం . ఆఖరికి ఎన్నికల రోజు ఇనుమెట్ల పోలింగ్ బూత్ లో కోడెల మా జాతిని అవమానించిన తీరు , పైగా నేరం మాపై రుద్దా...