మాకొద్దు బాబోయ్ ఈ పెద్ద కొడుకు
మాకొద్దు బాబోయ్ ఈ పెద్ద
కొడుకు
2014లో రాష్ట్రము
విడిపోయింది , ఆస్తులుపోయి అప్పులు మిగిలాయి , అనుభవంఉన్న నేత అవసరం నేను మీ పెద్ద కొడుకుగా
వస్తున్నా , మీ అందరి కష్టాలు
తీరుస్తా, మీఅందరిని నా కళ్ళలోపెట్టుకుని చూస్తా అంటే గొర్రె
కసాయివాడిని నమ్మినచందంగా నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నాము. మీరు ఈ 5 సంవత్సరాలలో బీద రాష్ట్రము, కట్టుబట్టలతో కరకట్ట కాపురం చేస్తున్నాము అని కల్లబొల్లి కబుర్లు చెపుతూ , మమ్మల్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేసి తమరు మాత్రము ప్రత్యేక విమానాలు, విచ్చలవిడి ఖర్చులు , ఇసుక మట్టి దోపిడీ, ప్రాజక్టుల పేరుతో ప్రజాధనం
నిలువు దోపిడీ, పూటకో దేశం , గంటకో రాష్ట్రము తిరుగుతూ ప్రజా సంక్షేమం పూర్తిగా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి, వచ్చినవాడు కొడుకు కాదు కొర్రివిదెయ్యం అని నిరూపించిన మీలాంటి కొడుకు మాకోద్దు బాబు.
ఎన్నికలు
దగ్గర పడుతున్న సందర్భంలో చిన్న చిన్న తాయిలాలు మాకు విదిల్చి , పెద్దకొడుకుగా వస్తున్నా అని మళ్లీ మమ్మల్ని
మభ్యపెట్టే మీ ఆలోచనకు మరొక్కసారి
మోసపోయేటంతటి అమాయకులం కాదు. పెద్దకొడుకుగా వచ్చానంటే కుటుంబ గౌరవాన్ని పెంచి ఆస్తులు పంచి, తలకొరివిపెట్టే భరోసా
అనుకున్నాం, కానీ మీరు మా ఆస్తులు తాకట్టు
పెట్టి, అప్పులు తెచ్చి తల ఒక్కింటికి లక్ష
పైచిలుకు అప్పు మిగిల్చి , మీ పబ్బం గడుపుకొని
కమ్మని పంచ భక్ష్య పరమాన్నాలు మీరు,
మీ కుమారుడు, మీ వందిమాగతులు
కడు తృప్తిగా భుజించి
మాకు బొక్కలు విదిల్చి మమ్మల్ని నడిరోడ్డుపైకి వీడుస్తారనిమాకేమి తెలుసు. మీలాంటి పెద్దకొడుకు
పగవాడిగా కూడా వద్దు.
బి జి ఆర్
మాకొద్దు బాబోయ్ ఈ పెద్ద
కొడుకు 1
10151
కోట్ల అంచనాతో, 2006లో మొదలైన పోలవరం ప్రాజెక్ట్,
5136 కోట్ల ఖర్చుతో వైస్సార్ హయాంలో 45 శాతం పనులు పూర్తి చేసి రికార్డు
నెలకొల్పింది. అంచనాలు కాంగ్రెస్ టైంలో 16010 కోట్లకు, 2016లో ఏకంగా 55385 కోట్లకు
పెంచింది మీరు కాదా. మీ హయాంలో 32000 కోట్లు
భూసేకరణకు పోనూ, మిగిలిన 23385 కోట్లలో , 11,069 కోట్లు ( 50 శాతం) ఖర్చు పెట్టినట్టు
చూపించి, కేవలం 21 శాతం పనులు పూర్తి చేసి
, గొప్పలకు పోయి పోలవరం ప్రాజెక్టుని నిలువునా ముంచిన మీరు మాకు పెద్ద కొడుకా? ఇల్లాంటి
కొడుకు అసలొద్దు బాబూ.
మాకొద్దు బాబోయ్ ఈ పెద్ద
కొడుకు 2
పురుషోత్తమపట్నం
ఎత్తిపోతల పథకం ఎస్టిమేట్స్ రూ 657 కోట్లనుండి 1638 కోట్లకు అంటే 2 ఏళ్లలో 250 శాతం పెంచి మెగాకు అప్పగించి బారీఅవినీతికి తెర దించి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన మీరు పెద్దకొడుకా? మేసింది
చాలదన్నట్టు, పైప్ లైన్ దూరం పెరిగిందని కుంటి సాకులు
చెప్పి అదనంగా రూ 75.87 కోట్లు దోసిపెట్టిన మీరు కొడుకు కాదు, కొర్రివి దెయ్యం. మాకొద్దు
బాబోయ్ ఈ పెద్ద కొడుకు.
మాకొద్దు బాబోయ్ ఈ పెద్ద
కొడుకు 3
ఎప్పటి
తెలుగుగంగ, 2014 ముందే పనులన్నీ అయిపోయాయి. కేవలం 450కోట్లు ఖర్చుపెడితే డిస్ట్రిబ్యూటరీలను
పూర్తి చేయవచ్చు. కానీ ఎస్టిమేట్స్ 4432 కోట్లనుండి
7736 కోట్లకు పెంచి, గుత్తేదార్ తో కుమ్మకై విపరీతంగా మేసే వ్యవస్థకు మూలస్తంభం నువ్వు కాదా? ఇంత మేసినా లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చే డిస్ట్రిబ్యూటరీలను పూర్తిచేసి రైతులను ఆదుకుందామనే
ఇంగితజ్ఞానము లేని వాడు పెద్ద కొడుకా? ఇలాంటి పెద్ద కొడుకు మాకొద్దు బాబు.
మాకొద్దు బాబోయ్ ఈ పెద్ద
కొడుకు 4
95 శాతం
పైన 2009లోనే పూర్తయిన తాడిపూడి లిఫ్ట్ కోసం మిగిలిన పనుల విలువ 41 కోట్లు. కానీ ఎస్టిమేట్లు 352 కోట్లుగా అంటే 900 శాతం పెంచి, గతంలో చేసిన పనులకే అదనంగా నిధులిచ్చి 100 కోట్లపైన మేసిందెవ్వరు? ఇంత దోపిడీ జరిగినా, ఇంకా రెండు సబ్ లిఫ్టుల
పని ఇంకా మిగిల్చారంటే, నిజంగా మీకు రైతులపై ప్రేమ
ఉందా? పైగా నిస్సిగ్గుగా పెద్దకొడుకునని బాకాలు ఊదుకుంటారా? మాకొద్దు బాబూ ఈ పెద్ద కొడుకు.
మాకొద్దు బాబోయ్
ఈ
పెద్ద
కొడుకు
5
హంద్రీ
నీవా సుజల స్రవంతి అంచనా రూ. 6850 కోట్లు. 2014 నాటికి 75% పైన పూర్తి అయ్యింది. అంచనా మొత్తాన్ని ప్రధాన కార్యదర్శి హెచ్చరించినా రూ 11772 కోట్లకు పెంచి, అంటే 1750 కోట్లతో చేయాల్సిన పనులను 4922 కోట్లకు
పెంచిన మీరు రైతు బాంధవుడా? పాత
గుత్తేదార్ ని మార్చి , సి
ఎం రమేష్, మెగా,
కేశవ్ బినామీలకు పనులు కట్టబెట్టి భారీగా దండుకుందెవ్వరు. కుప్పం బ్రాంచి కెనాల్
పనులను రూ 230 కోట్ల నుండి 430 కోట్లకుపెంచి సి ఎం రమేష్
కి ఇచ్చిన వైనం, ఇంకా దోసుకోవాలి అని అదనంగా 287 కోట్లు ఇవ్వడానికి రంగం సిద్ధం చేయడం ఎవరి అవినీతికి పరాకాష్ట. ఇంత ఖర్చు
చేసినా పూర్తి కాని బ్రాంచ్ కెనాల్ పనులు. పెద్ద కొడుకుని , మీ కష్టాలు తీరుస్తా
అని చెప్పుకోవడానికి మీకు సిగ్గేయటం లేదూ? ఇలాంటి
కొడుకు మాకొద్దు బాబూ?
మాకొద్దు బాబోయ్
ఈ
పెద్ద
కొడుకు
6
వెలిగొండ
ప్రాజెక్ట్ ఎప్పుడిదో. 312 కోట్లతో
చేప్పట్టవల్సిన సొరంగం పని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మిగిలిపోయింది. 2014 తర్వాత
ఈ ఎస్టిమేట్ అతిభారీగా అంటే 3 1/2 రెట్లు అంటే 1021 కోట్లకు పెంచి 681 కోట్ల వర్క్ సి ఎం రమేష్
కంపెనీ రిత్విక్ కు, 339 కోట్ల పనిని మెగా కు ఇచ్చి, ఎంత
దోసుకున్నారో భగవంతునికే తెలుసు. గతంలో
డబ్బు చెల్లించిన టన్నెల్ బోరింగ్ మేషీన్ లకు మరలా 243 కోట్లు బడ్జెట్ కేటాయించడం మీకే చెల్లు. పోనీ ప్రాజెక్ట్ పూర్తి అయ్యిందా అంటే అదీ లేదు.
రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, అప్పుతెచ్చిన డబ్బుతో పబ్బం గడుపుకొంటున్న నీలాంటి కొడుకు అసళ్ళొద్దు
బాబూ.
మాకొద్దు బాబోయ్
ఈ
పెద్ద
కొడుకు
7
గాలేరు-నగరి
సృజల స్రవంతి. ఇంకా పని పూర్తికాలేదంటే రాష్ట్రానికి
సిగ్గు చేటు. పని కొద్దిగా మిగిలిన 25వ ప్యాకేజీ
ఎస్టిమేట్ ని 11.91 కోట్లనుండి 112 కోట్లు
అంటే 10 రేట్లు, అలాగే 27వ ప్యాకేజీ మిగులు పనులు
17 కోట్లనుండి 85 కోట్లకు అంటే 5 రేట్లు
పెంచి రిత్విక్ కి అప్పచెప్పి ఖజానాకు చిల్లు పెట్టింది మీరు కాదా. ఇదేకాక సొరంగం పనులలో
75 కోట్లు పందికొక్కుల్లా మేసింది ఎవరో. నీ లాంటి పెద్ద కొడుకు అసలొద్దు బాబూ.
మాకొద్దు బాబోయ్
ఈ
పెద్ద
కొడుకు
8
చింతలపూడి
లిఫ్ట్ పథకం, 2009 లోనే 1701 కోట్ల ఎస్టిమేట్
తో చేపట్టిన పథకం. 2014లో వచ్చిన టీడీపీ ప్రభుత్వం అంచనాలను భారీగా అంటే
4907 కోట్లకు ( 3 రెట్లు)పెంచి మెగాకు, నవయుగాకు కట్టబెట్టిందెవరు? చాలదన్నట్టు తొలిదశ
పనుల్లో 586 కోట్ల పనులు మేగా కి నామినేషన్ పద్ధతిలో దోచిపెట్టడం. అక్రమాలను ఎత్తి
చూపారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని EPC హై పవర్ కమిటీ నుండి తప్పించి, ఇష్టానుసారం
దోచుకొనే చీకటి వ్యవస్థకు రారాజైన నీవూ మాకు అసలు కొడుకువేకాదు.
మాకొద్దు బాబోయ్
ఈ
పెద్ద
కొడుకు
9
కృష్ణా
డెల్టా ఆధునీకరణలో అక్రమాలకు అంతే లేదు. గండేరు డ్రైన్ పనులలో 42.49 కోట్లు దారి మళ్లించి , ప్రభుత్వ అనుమతి లేకుండా ఇరిగేషన్ మంత్రి గారి క్యాంపు ఆఫీస్, నడక దారి అని, ఇది చాలదన్నట్టు ఇరిగేషన్ ఆఫీస్ కాంప్లెక్స్ పేరుతో 52 కోట్లు ఉమా బినామీ సూర్య కి కట్టబెట్టడం,
ఇలా బరితెగించి దోపీడీచేస్తున్న వారి
కొమ్ము కాస్తున్న మీరు రాష్ట్ర ప్రజలకు పెద్దకొడుకా? మాకొద్దు బాబూ ఇలాంటి కొడుకు?
మాకొద్దు బాబోయ్
ఈ
పెద్ద
కొడుకు
10
నీరు
-మట్టి పేరుతో టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీలు దోసుకొన్నది అవినీతికి పరాకాష్ట. చిన్న
చితకా పనులకింద చూపించి నామినేషన్ పద్దతిలో 12,534 కోట్ల ఉపాధి హామీ, ఇరిగేషన్, అటవీశాఖ
నిధులు కేటాయించి బారిగా బొక్కిందెవ్వరు. పొల్లాలోకి మట్టి కావాలంటే మేము డబ్బు చెల్లించి
తెచ్చుకున్నాం. కానీ నీరు-చెట్టు పేరుతో పూడిక తీసిన మట్టికి బారి మొత్తం చెల్లించినట్టు
చూపించిన మీరు రాష్ట్రానికి పెద్ద కొడుకా?
మీ లాంటి కొడుకుంటే కొండలు పిండి చేసినా తినేసేదానికి చాలవు. నీలాంటి కొడుకుని మేము భరించలేము బాబూ.
మాకొద్దు బాబోయ్
ఈ
పెద్ద
కొడుకు
11
ఇళ్ల
నిర్మాణంలో భారీగా అవినీతి జరిగింది, ఇంటిపై
అప్పుని పూర్తిగా తీసేస్తాను అని జగన్ గారు అంటుంటే సంబరపడ్డాం. నేను పేదలకు 10లక్షల
ఇల్లు కడతాను, ముందు అప్పుగా అనుకున్న మొత్తాన్ని కూడా నేనే తీరుస్తాను అని మీరంటుంటే , అసలు విషయం ఏమిటా అని లోతుగా ఆలోచించాం. మొన్ననే మేము ఇల్లు కట్టుకుంటే అడుగుకు
1000 రూపాయల లోపే అయ్యింది. కానీ మీరు మా ఇంటి కన్నా తక్కువ సదుపాయాలున్న ఇళ్లకు
ఏకంగా అడుగుకి 2700 రూపాయలు చెల్లించినట్టు చూపుతన్నారంటే ఎంత అవినీతి, ఎంత విచ్చలవిడితనం.
.కనీసం ఇంటికి 5 లక్షల చొప్పున, 10లక్షల ఇళ్లకు
నొక్కే మొత్తం 50000 కోట్లు పైమాటే . ఈ డబ్బంతా అప్పే కదా. రాష్ట్ర అప్పు రూ
3500000 కోట్లకు పెరగడానికి ఇదొక కారణం కదా. అప్పు రాష్ట్ర ప్రజలపై రుద్ది, నొక్కిన
డబ్బుతో కొందరు పెద్దలు ఆస్తులు పెంచుకొని , మమ్మల్ని రోడ్డుపై కీడ్చే పరిస్థితి
కల్పించిన నీవేమి పెద్దకొడుకువయ్యా ?
మాకొద్దు బాబోయి
ఈ
పెద్ద
కొడుకు
12
పెద్దకొడుకంటే
చేదోడు వాదోడుగా ఉండి, తన
తోబుట్టువులను బాగా
చదివించి ప్రయోజకులను చేసేవాడు. 18 ఏళ్ళు
నిండిన పిల్లలకు నిరుద్యోగభృతి ఇస్తాను అని కల్లబొల్లి కబుర్లు చెప్పి , మా పిల్లలను అప్రయోజకులుగా చేసి,
మీలాంటి బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో తక్కువ జీతాలకు దినకూలీలుగా పనిచేసేవ్యవస్థకు శ్రీకారం చుట్టాలన్న దుర్మార్గపు ఆలోచన వున్న మీరు
కొడుకేనా? పిల్లల్ని బాగా చదివించండి, డాక్టర్లను చేయండి, ఇంజినీర్లని చేయండి, ఐఏఎస్ చేయండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు , నేనున్నాను అని భవిష్యత్తుకు భరోసా ఇస్తున్న జగన్ లాంటి కొడుకు కావాలి, అన్న కావాలి. మీలాంటి
కొడుకు పగవాడికి కూడా వద్దు బాబు.
మాకొద్దు బాబోయి
ఈ
పెద్ద
కొడుకు
13
అమరావతికి
హైపర్ లూప్ ట్రైన్ అన్నావు, ఒలింపిక్స్ అన్నావు, క్రీడలలో నోబెల్ ప్రైజ్ అన్నావు. ఇవన్నీ కోతలని ప్రజలు నవ్వుకున్నారు. ఇప్పుడేమో అమరావతికి బులెట్ ట్రైన్ తెస్తాను, అమరావతికి ఎయిర్ కండిషనింగ్ భూగర్భ పైప్ లైన్స్ ద్వారా ఇస్తాను అంటూ , ఇవ్వి చాలదన్నట్టు నేను నిర్మించిన హైదరాబాద్ ను కెసిఆర్ లాక్కున్నాడు,
20 హైద్రాబాదులు నిర్మిస్తానంటుంటే, కోతల్లో మీరు
బందర్ పోర్ట్ కెసిఆర్ తెలంగాణకు
లేపుకుపోతున్నాడు అన్న పుత్రరత్నం కన్నా మించిపోయినట్టుంది. పిట్టలదొరలా పూటకొక కథ అల్లి పబ్బం
గడుపుకునే మీరు మాకొద్దు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాను, మనిషికి విశ్వతనీయత ముఖ్యం, చేయలేనిది చెప్పను, చెప్పింది చేస్తాను నన్ను నమ్మండి, అవకాశం ఇవ్వండి అంటున్న జగన్ లాంటి కొడుకు కావాలి,అన్న కావాలి.
మాకొద్దు బాబోయి
ఈ
పెద్ద
కొడుకు
14
అల్లుడుగారుఅని
ముద్దుగా పిలుచుకుందామంటే, ఎక్కడ వెన్నుపోటు పొడుస్తావోనని భయం. పిల్లనిచ్చిన్న మామ, రాజకీయభిక్ష పెట్టిన ఎన్టీఆర్ గారినే గట్టిగా పొడిచిన మీకు మేమొక లెక్కా? ఇంటికి పెద్దకొడుకునని చెప్పుకుంటూ తిరుగుతూ, మా ఆస్తులు తాకట్టుపెట్టి,
మా సంపద తగ్గుతుంటే ,మీ ఆస్తులు కొన్ని
వందల శాతం
పెంచుకుంటూ మమ్మల్ని అప్పులపాలుచేసిన నీవేమి కొడుకువయ్యా .పోనీ అన్నా అని ఆప్యాయంగా అనుకొంటే , డ్వాక్రా చెల్లమ్మలు , నేను మీ పెద్దన్నను, మీకు
పసుపు కుంకుమ నేనే పెట్టా, మళ్ళీ మళ్ళీ పెడతా అంటూ, అంతటితో ఆగకుండా మీకెంతమంది
అన్నతమ్ములు, వాళ్ళు మీకెప్పుడన్నా పసుపు-కుంకుమ పెట్టారా అంటూ పదేపదే దెప్పిపొడిచి, మా చేత లేదు
అని బలవంతంగా చెప్పించుకొని, తోబుట్టువుల
మద్య చిచ్చు పెట్టిన మిమల్ని ఆప్యాయంగా అన్నా అని ఎలా
పిలవాలి? అనుబంధాలు ఏ కోశానాలేని బంధాలు
మాకొద్దు బాబూ .
BBC/BGR
Comments